శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (14:53 IST)

జయలలితగా దేవసేన... ఐశ్వర్యా రాయ్ ఔట్?

అన్నాడీఎంకేతో పాటు.. తమిళనాడు రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర త్వరలోనే వెండితెర దృశ్యకావ్యంగా రానుంది. ఇందుకోసం కోలీవుడ్‌లో ముమ్మరంగా కసరత్తులు జరుగుతున్నాయి.

అన్నాడీఎంకేతో పాటు.. తమిళనాడు రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర త్వరలోనే వెండితెర దృశ్యకావ్యంగా రానుంది. ఇందుకోసం కోలీవుడ్‌లో ముమ్మరంగా కసరత్తులు జరుగుతున్నాయి.
 
తమిళ విప్లవనాయకిగా నీరాజనాలు అందుకున్న జయలలిత గత 2015 డిసెంబరు నెలలో అనారోగ్యం కారణంగా చనిపోయిన విషయం తెల్సిందే. జ‌య‌ల‌లిత జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం. దీంతో ఆమె జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఓ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారు. 
 
ఇందుకోసం పలువురు నిర్మాతలు, దర్శకులు పోటీ పడుతున్నారు. కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం జయలలిత పేరుపై మూడు బయోపిక్‌లు సిద్ధమవుతున్నాయి. వీటిలో వైబ్రెంట్ మీడియా అధినేత ఆదిత్యా భరద్వాజ్ మాత్రం ముమ్మరంగా ఉన్నారు. ప్రస్తుతం స్క్రిప్టు, కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు వెల్లడించారు. 
 
ఈనేపథ్యంలో త‌మిళ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో జయలలిత పాత్రలో ఐశ్వర్యారాయ్‌ని కానీ... అనుష్కను నటింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు భారతీ రాజా ప్ర‌య‌త్నిస్తున్నారు. కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు జయలలిత పాత్రలో అనుష్కను ఎంపిక చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. 
 
ఐశ్వర్యారాయ్‌తో పోల్చితే అనుష్క అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందన్నది వారి భావనగా ఉంది. పైగా, రెమ్యునరేషన్‌ విషయంలో కూడా పెద్దగా డిమాండ్ ఉండచకపోవచ్చని భావిస్తున్నారు. అందుకే అనుష్క పేరును ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.