గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (14:36 IST)

శింబు సరసన దేవసేన.. ఏ సినిమాలో తెలుసా?

శింబు సరసన దేవసేన నటిస్తోందా.. ఇదేంటి? అనుకుంటున్నారు కదూ.. అవునండి. గతంలో వచ్చిన ''ఏ మాయ చేసావే'' (తమిళంలో విన్నై తాండి వరువాయా) చిత్రానికి ప్రస్తుతం తమిళంలో సీక్వెల్ చేస్తున్నారు. శింబు హీరోగా గౌతమ్

శింబు సరసన దేవసేన నటిస్తోందా.. ఇదేంటి? అనుకుంటున్నారు కదూ.. అవునండి. గతంలో వచ్చిన ''ఏ మాయ చేసావే'' (తమిళంలో విన్నై తాండి వరువాయా) చిత్రానికి ప్రస్తుతం తమిళంలో సీక్వెల్ చేస్తున్నారు. శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తుందని సమాచారం. 
 
ప్రస్తుతం శింబు మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విన్నై తాండి వరువాయా సీక్వెల్‌లో నటించనున్నాడు. ఏ మాయ చేసావే తమిళ సినిమా గౌతమ్ మేనన్, శింబు, త్రిష కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. 
 
ఇందులో శింబు సరసన అనుష్క శెట్టి నటించనుందని టాక్. ఇందుకోసం అనుష్కతో గౌతమ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తెలుగులోనూ ఈ సినిమాకు సీక్వెల్ వుంటుందని.. మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారని, అనుష్క శింబు లవర్‌ పాత్రలో కనిపిస్తుందని టాక్ వస్తోంది.