శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఆగస్టు 2018 (12:58 IST)

'అమ్మ' పాత్ర చేసే ధైర్యం నాకు లేదు : కీర్తి సురేష్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించే ధైర్యం లేక సాహసం తనకు ఏమాత్రం లేదని సినీ నటి కీర్తి సురేష్ అన్నారు. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించే ధైర్యం లేక సాహసం తనకు ఏమాత్రం లేదని సినీ నటి కీర్తి సురేష్ అన్నారు. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈ విషయాన్ని గురించి కీర్తి సురేశ్ స్పందిస్తూ.. 'ఇంతవరకూ ఈ పాత్రను గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. జయలలితగారు గొప్పనటి.. అంతకు మించిన గొప్ప నాయకురాలు. అలాంటి జయలలితగారిలా నటించడం అంత తేలికైన విషయం కాదు.. అంత ధైర్యం కూడా నాకు లేదు' అన్నారు.
 
ప్రస్తుతం కేరళ వరద బాధితులకి సహాయ సహకారాలను అందించే పనుల్లో తాను ఉన్నాననీ, నిరాశ్రయులైనవారిని చూస్తున్నప్పుడు తనకి చాలా బాధ కలుగుతోందని చెప్పారు. 'మహానటి'లో సావిత్రిగా అద్భుతంగా నటించిన కీర్తి సురేశ్‍ను ఒక దర్శకుడు ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.