1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
  4. How to make the cauliflower pulao

గోబీ పువ్వుతో పులావ్.. ఎలా చేయాలో తెలుసా..?

కావలసిన పదార్థాలు: బాస్‌మతి రైస్ - 2 కప్పులు గోబీ పువ్వు - 1 ఉల్లిపాయ - 1 పచ్చిమిర్చి - 3 జీలకర్ర - 1 స్పూన్ కారం - 2 స్పూన్స్ దాల్చిన చెక్క - చిన్న ముక్క ఉప్పు - తగినంత నూనె - సరిపడా.. ఇంకా చదవండి.

cauliflower
కావలసిన పదార్థాలు:
బాస్‌మతి రైస్ - 2 కప్పులు
గోబీ పువ్వు - 1
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 3
జీలకర్ర - 1 స్పూన్
కారం - 2 స్పూన్స్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
లవంగాలు - 3
కొత్తిమీర - కొద్దిగా
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను వేసి వేడయ్యాక జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. కాసేపటి తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మరికాసేపు వేయించాలి. ఇప్పుడు గోబీ పువ్వును కట్ చేసి శుభ్రం చేసుకుని అందులో ఉప్పు వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముందుగా తయారుచేసుకున్న మసాలాలో ఈ గోబీ పువ్వులు వేసుకుని కాసేపు వేయించుకుని ఉడికించుకున్న అన్నం ఆ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరు చల్లుకోవాలి. అంతే... వేడివేడి గోబీ పువ్వు పులావ్ రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
దానిమ్మ పండు రసం లేదా విత్తనాలు... ఏవి బెస్ట్?