శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:40 IST)

మీల్‌మేకర్ పులావ్ తయారీ విధానం...

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - 2 కప్పులు మీల్‌మేకర్ - 1 కప్పు ఉల్లిపాయలు - 2 పచ్చిమిర్చి - 2 అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ పసుపు - కొద్దిగా పుదీనా - పావు కప్పు కొత్తిమీర - పావు కప్పుట బిర్యా

కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - 2 కప్పులు
మీల్‌మేకర్ - 1 కప్పు
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 2
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
పసుపు - కొద్దిగా 
పుదీనా - పావు కప్పు
కొత్తిమీర - పావు కప్పుట
బిర్యానీ ఆకు - 1 
యాలకులు - 3 
లవంగాలు - 3
దాల్చిన చెక్క - చిన్నముక్క
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత
నీళ్లు - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేడినీళ్ళల్లో మీల్‌మేకర్, ఉప్పు వేసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. బాణలిలో సోంపు, దాల్చిన చెక్క లవంగాలు, యాలకులు వేసి వేయించుకుని మసాలా పొడిలా చేసుకోవాలి. తరువాత మీల్‌మేకర్‌ను నీళ్ళు పోయేలా చేతులతో పిండుకోవాలి. తరువాత ఉప్పు, కారం, మసాలా వేసి కలిపిపెట్టుకోవాలి.

మరో బాణలిలో నూనెను పోసి వేడయ్యాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేగించుకుని అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మీల్‌మేకర్ వేసి 5 నిమిషాలు ఉడించుకుని కొత్తిమీర, పుదీనా, బాస్మతి బియ్యం వేసి 3 కప్పులు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అంతే వేడివేడి మీల్‌మేకర్ పులావ్ రెడీ.