శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:06 IST)

గుమ్మడికాయ ముద్ద.. మైదా పరోటా.. ఎలా..?

కావలసిన పదార్ధాలు: గుమ్మడికాయ గుజ్జు - 1 కప్పు మైదాపిండి - 3 కప్పులు ఉప్పు - తగినంత నూనె - సరిపడా తయారీ విధానం: ముందుగా గుమ్మడికాయ ముక్కలను ఉడికించుకుని ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పు

కావలసిన పదార్ధాలు: 
గుమ్మడికాయ గుజ్జు - 1 కప్పు
మైదాపిండి - 3 కప్పులు
ఉప్పు - తగినంత 
నూనె - సరిపడా 
 
తయారీ విధానం: 
ముందుగా గుమ్మడికాయ ముక్కలను ఉడికించుకుని ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదాపిండిలో కొద్దిగా నూనె, తగినంత ఉప్పు, గుమ్మడికాయ ముద్ద, కొద్దిగా వేడినీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని ఉండలుగా చేసుకుని పరోటాల్లా తయారుచేసుకుని పాన్‌పై వేయించుకోవాలి. అంతే... ఘుమఘుమలాడే గుమ్మడికాయ పరోటాలు రెడీ.