1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
  4. How to make the amla rice

ఆమ్లా రైస్ ఎలా చేయాలో తెలుసా?

కావలసిన పదార్ధాలు: బియ్యం - అరకప్పు ఉసిరికాయలు - 10 పసుపు - అర స్పూన్ ఇంగువ - చిటికెడు ఉప్పు - తగినంత నూనె - తగినంత నువ్వుల పొడి - 2 స్పూన్స్ జీడిపప్పు - 4 ఎండుమిర్చి - 4 పచ్చిమిర్చి - 4 కరివేప

amla
కావలసిన పదార్ధాలు:
బియ్యం - అరకప్పు 
ఉసిరికాయలు - 10 
పసుపు - అర స్పూన్ 
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత 
నూనె - తగినంత 
నువ్వుల పొడి - 2 స్పూన్స్
జీడిపప్పు - 4 
ఎండుమిర్చి - 4
పచ్చిమిర్చి - 4 
కరివేపాకు - 2 రెమ్మలు 
కొత్తిమీర కట్ట - 1 
శెనగపప్పు - 1 స్పూన్ 
మినప్పప్పు - 1 స్పూన్ 
ఆవాలు - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా అన్నం వండుకుని బౌల్‌లో ఆరబెట్టాలి. ఇప్పుడు ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్‌చేసుకుని అందులో ఉప్పు వేసి వాటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఎండుమిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పసుపు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. 3 నిమిషాల తరువాత దించుకుని అందులో అన్నం కలుపుకుంటే వేడివేడి ఆమ్లా రైస్ రెడీ.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
కలబంద గుజ్జులో పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?