సోమవారం, 4 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By selvi
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:47 IST)

వర్షాకాలంలో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటే?

ముందుగా చికెన్ ముక్కల్ని శుభ్రం చేసుకుని.. మిర్చి, వెల్లుల్లి, ఉల్లి, కొత్తిమీర పేస్టులను చికెన్‌కు పట్టించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కలుపుకుని అరగంట నానబెట్టాలి. ఇందులోనే ఓ టేబుల్‌స్పూను ఆలివ్ నూనె కూడా

పిల్లల్లో కండర పుష్టి పొందడానికి ఉడికించిన చికె‌న్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. అందులోనూ గ్రిల్డ్ చికెన్ లేదా ఉడికించిన చికెన్‌ను తీసుకోవాలి. చికెన్‌లో ఉండే ప్రోటీనులు తగినంత శక్తినిచ్చి, శరీరంలోని నొప్పుల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. అలాంటి చికెన్‌తో హనీ గ్రిల్డ్ చికెన్ ఎలా చేయాలో తెలుసుకుందామా..? 
 
కావలసిన పదార్థాలు:
చికెన్ ముక్కలు- నాలుగు 
పచ్చిమిర్చి పేస్ట్ - ఒక స్పూన్
హనీ- నాలుగు టేబుల్ స్పూన్లు
నిమ్మకాయ- ఒకటి
వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్ 
ఉప్పు- తగినంత, 
ఆలివ్ నూనె - తగినంత  
ఉల్లిపాయ పేస్ట్- నాలుగు స్పూన్లు 
కొత్తిమీర, పుదీనా పేస్ట్- చెరో రెండు స్పూన్లు 
 
తయారీ విధానం.. 
ముందుగా చికెన్ ముక్కల్ని శుభ్రం చేసుకుని.. మిర్చి, వెల్లుల్లి, ఉల్లి, కొత్తిమీర పేస్టులను చికెన్‌కు పట్టించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కలుపుకుని అరగంట నానబెట్టాలి. ఇందులోనే ఓ టేబుల్‌స్పూను ఆలివ్ నూనె కూడా వేసి కలపాలి. తర్వాత నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి చికెన్‌ ముక్కల్ని రెండువైపులా కాల్చి తీయాలి. ఓవెన్‌ ఉంటే అందులో కూడా గ్రిల్‌ చేసుకోవచ్చు. చివరిగా వీటికి హనీ రాసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.