1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. beauty tips with cucucmber and curd

కీరదోస మిశ్రమంలో పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

కీరదోస మిశ్రమంలో పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయి. బియ్యపు పిండిలో కొద్దిగా రోజ్ వాటర్, బాదం

cucucmber
కీరదోస మిశ్రమంలో పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయి. బియ్యపు పిండిలో కొద్దిగా రోజ్ వాటర్, బాదం నూనె, పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. దీంతో ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది.
 
ఉసిరి కాయ పొడిలో ఆలివ్ నూనె, పెరుగు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. గ్రీన్ టీ ఆకులను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నీరు, చక్కెర కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 
 
కాకరకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మెుటిమలు తొలగిపోతాయి. నారింజ తొక్కల పొడిలో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
బొప్పాయి గుజ్జు, ముల్తానీ మట్టితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే?