1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. beauty tips with papaya and multani mitti

బొప్పాయి గుజ్జు, ముల్తానీ మట్టితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే?

శెనగపిండిలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం ముడతులు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. కొబ్బరినూనెను మెడకు, ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్

papaya
శెనగపిండిలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం ముడతులు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. కొబ్బరినూనెను మెడకు, ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది.
 
కలబంద గుజ్జులో పసుపు, తేనె, పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల మెుటిమలు, నల్లటి వలయాలు తొలగిపోతాయి. బేకింగ్ సోడాలో ఆలివ్ నూనె, తేనె కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. 
 
నిమ్మరసంలో పంచదార కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి గుజ్జులో కొద్దిగా ముల్తానీ మట్టి, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
వర్షాకాలంలో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటే?