మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (13:18 IST)

మునగ ఆకుల పొడితో మధుమేహ వ్యాధికి చెక్..

మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఐరన్, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మునగ ఆకులతో రకరకాలు వంటకాలు తయారుచేస్తుంటారు. ఈ ఆకులను సూప్ రూపంలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. నిత్యం ఈ మునగ ఆకులను ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన క్యాల్షియం, ఐరన్ వంటి పదార్థాలు అందుతాయి.

 
కంటివాపును తగ్గిస్తుంది. తలనొప్పితో బాధపడేవారు ఈ మునగ చెట్టు వేర్లను బాగా కడిగి జ్యూస్‌లా చేసుకుని అందులో కొద్దిగా పటిక బెల్లం కలుపుకుని సేవిస్తే తలనొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చును. మునగ ఆకులను పేస్ట్‌లో కొద్దిగా తేనె కలిపి కంటి రెప్పలపై రాసుకుంటే నేత్ర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. దాంతో కంటి చూపు మెరుగుపడుతుంది. 
 
రక్తాన్ని శుభ్రం చేస్తుంది. చర్మ వ్యాధులు నుండి కాపాడుతుంది. మునగాకు రసాన్ని తరచుగా తీసుకుంటే వృద్ధాప్యం వలన వచ్చే చర్మం ముడతలు తొలగిపోతాయి. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ ఉంచుతుంది. మునగ ఆకులను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ ఉదయాన్నే మరగడుపున తాగితే మధుమేహా వ్యాధికి దివ్యౌషధంగా పనిచేస్తుంది.