శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (12:28 IST)

కొత్తిమీర తీసుకుంటే.. ఆకలి వుంటుందా వుండదా?

కొత్తిమీరలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, క్యాల్షియం, పాస్పరస్, కైరోటిన్, థియామీన్, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచుటకు సహాయపడుతాయి.

కొత్తిమీరలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, క్యాల్షియం, పాస్పరస్, కైరోటిన్, థియామీన్, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచుటకు సహాయపడుతాయి. మలబద్ధకానికి విరుగుడుగా పనిచేస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగించుటకు ఇలా చేయవచ్చును.. వేడినీళ్ళల్లో కొద్దిగా కొత్తిమీరు, ధనియాల పొడి వేసుకుని బాగా మరిగించుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని వడగట్టి చల్లారిన తరువాత తీసుకుంటే శరీరంలోని కొవ్వు తొలగిపోతుంది. కొత్తిమీరలో పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అల్లం చేర్చి పచ్చడిలా తయారుచేసుకుని తీసుకుంటే అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. కొత్తిమీర ఆకలి నియంత్రణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. టైఫాయిడ్ వ్యాధితో బాధపడేవారికి కొత్తిమీర చాలా మంచిది.