గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (15:44 IST)

శృంగార సామర్థ్యాన్ని పెంచే కొత్తిమీర...

ఇంట్లో కొన్ని రకాల కూరల్లో కొత్తిమీరకు వాడుతుంటారు. ముఖ్యంగా రసంపాటు.. చికెన్, మటన్ వంటి కూరల తయారీలో దీన్ని క్రమం తప్పకుండా వాడుతారు. ఈ కొత్తిమీర వాడటం వల్ల కూరలకు మంచి రుచి వస్తుంది.

ఇంట్లో కొన్ని రకాల కూరల్లో కొత్తిమీరకు వాడుతుంటారు. ముఖ్యంగా రసంపాటు.. చికెన్, మటన్ వంటి కూరల తయారీలో దీన్ని క్రమం తప్పకుండా వాడుతారు. ఈ కొత్తిమీర వాడటం వల్ల కూరలకు మంచి రుచి వస్తుంది. అంతేకాదు, కొత్తిమీర‌ను అలాగే నేరుగా కూర‌గా చేసుకున్నా లేదా ప‌చ్చడిగా చేసుకు తిన్నా అద్భుతంగా ఉంటుంది.
 
అయితే నిజానికి కొత్తిమీర‌ను కొన్ని వేల సంవ‌త్స‌రాల కింద‌టే వినియోగంలోకి తెచ్చారు. ఈ మొక్క మంచి వాస‌న‌ను ఇస్తుంది. కొత్తిమీర‌లో మ‌న శ‌రీరానికి ప‌నికొచ్చే ఎన్నో ప్రోటీన్లు, విట‌మిన్లు, ల‌వ‌ణాలు, లోహాలు ఉంటాయి. అందుకే ఈ కొత్తిమీరను త్రిదోష హరిణి అని కూడా అంటారు. ఈ క్ర‌మంలోనే కొత్తిమీర‌ను నిత్యం వాడ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* జీర్ణ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో కొత్తిమీర అద్భుతంగా ప‌నిచేస్తుంది. 
* కొత్తిమీర జ్యూస్‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే జీర్ణ స‌మ‌స్య‌లైన గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి.
* శ‌రీరంలో వాత‌, పిత్త‌, క‌ఫాల‌ల్లో అస‌మాన‌త‌లు ఉండ‌డం వ‌ల్ల అనారోగ్యంపాలవుతారు. అయితే కొత్తిమీరను నిత్యం వాడ‌డం వ‌ల్ల త్రిదోషాలు హ‌రించుకుపోతాయి. 
* కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగడం వ‌ల్ల శ‌రీరం శుభ్ర‌మ‌వుతుంది. 
* జ్వరం వ‌చ్చిన వారు కొత్తిమీర జ్యూస్ తాగితే ఫ‌లితం ఉంటుంది. 
* కొత్తిమీర‌లో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు అన్ని ర‌కాల జ్వ‌రాల‌ను తగ్గిస్తాయి. 
* కొత్తిమీర జ్యూస్ తాగ‌డం వ‌ల్ల పురుషుల‌లో శృంగార సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది. 
* జీర్ణకోశంలో గ్యాస్‌ ఉత్పత్తి కానివ్వదు. సులభంగా మూత్ర విసర్జన జరిగేలా చేసి కిడ్నీల ఆరోగ్యానికి కొత్తిమీర‌ దోహదపడుతుంది. 
* కొత్తిమీర జ్యూస్‌ తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, బి1, బి2, సి లభిస్తాయి. 
* ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు కొత్తిమీర జ్యూస్‌ను తాగితే ఫ‌లితం ఉంటుంది. 
* కొత్తిమీర టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్‌, ఇతర లిపిడ్ లెవ‌ల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.