గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (23:02 IST)

బీన్స్ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

సహజంగా మనం ప్రతిరోజు రకరకాల కూరగాయలను తింటూఉంటాం. ఒక్కొక్క కూరగాయలో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా శరీర బరువు నియంత్రించటంలో బీన్స్ ప్రముఖపాత్ర పోషిస్తుంది.

సహజంగా మనం ప్రతిరోజు రకరకాల కూరగాయలను తింటూఉంటాం. ఒక్కొక్క కూరగాయలో ఒక్కో రకమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా శరీర బరువు నియంత్రించటంలో బీన్స్ ప్రముఖపాత్ర పోషిస్తుంది. బీన్స్ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. బీన్స్‌లో పుష్కలమైన యాంటీ-ఆక్సిడెంట్స్, విటమిన్స్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్ వంటి మినరల్స్ కలిగి ఉంటుంది. కనుక ఇది మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.
 
2. బీన్స్ ఒక సంపూర్ణ ఆహారం. ఇది చాలా తక్కువ శాతంలో కొవ్వును కలిగి ఉంటుంది. కనుక దీనిని క్రమం తప్పకుండా తీసుకోవటం వలన మనం ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటాము.
 
3. బీన్స్ ఎక్కువుగా ఫైబర్‌ని కలిగి ఉండటం వలన జీర్ణక్రియ వ్యవస్థలో చాలా ఉపయోగపడుతుంది. మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.
 
4. బీన్స్ నెమ్మదిగా జీర్ణమయ్యే సంక్లిష్ట కార్బోహైడ్రెట్స్ మరియు ప్రోటీన్స్‌ను కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. అంతేకాకుండా రక్తంలోని గ్లోకోజ్ స్ధాయిలను నిర్ధిష్టంగా ఉంచుతుంది.
 
5. శరీర పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి విస్తారమైన ప్రోటీన్స్ అవసరం. బీన్స్ ప్రోటీన్స్‌కు మూలాధారం అవటం వలన శాఖాహారులకు ఇది మంచి ఆహారం.
 
6. బీన్స్‌లో ఎక్కువ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉండటం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ బీన్స్ ప్రతిరోజు తీసుకోవటం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు.