శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (10:44 IST)

పెరుగు తీసుకుంటే... స్లి‌మ్‌గా ఉంటారు...

స్లిమ్‌గా ఉండేందుకు ఆహారాన్ని తగ్గించుకోవడం, వైద్య చికిత్సలు తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. అధిక బరువు గలవారు కడుపును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

స్లిమ్‌గా ఉండేందుకు ఆహారాన్ని తగ్గించుకోవడం, వైద్య చికిత్సలు తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. అధిక బరువు గలవారు కడుపును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు ప్రతిరోజూ కప్పు పెరుగు తీసుకుంటే అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
   
 
పెరుగులోని క్యాల్షియం శరీరంలో కొవ్వును తగ్గించి స్లిమ్‌గా ఉండేలా చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తిచేస్తుంది. పెరుగులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తుంది. పెరుగును తరచుగా తీసుకుంటే ఇతర చిరుతిండి పదార్థాలు తీసుకోవాలనిపించదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చిరుతిండి పదార్థాలు తినడం వలన అధిక బరువు పెరుగు దాంతో కడుపు కూడా పెరుగుతుంది.  
 
అంతేకాకుండా శరీరం కొవ్వు పెరిగిపోతుంది. కనుక పెరుగు తప్పకుండా డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. 200 గ్రాముల పెరుగులో 300 గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెప్తున్నారు. ఈ క్యాల్షియం కడుపులోని కొవ్వును బయటకు పంపుటకు ఉపయోగపడుతుంది.