సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (15:48 IST)

కీరదోస రసం, కాఫీ పొడి కలిపి ప్యాక్ వేసుకుంటే..?

జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. వద్దు వద్దూ.. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. కీరదోస మిశ్రమంలో కొద్దిగా గుడ్డు సొన, ఆలివ్ నూనె కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకుని తలకు రాసుకోవాలి.

జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. వద్దు వద్దూ.. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. కీరదోస మిశ్రమంలో కొద్దిగా గుడ్డు సొన, ఆలివ్ నూనె కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకుని తలకు రాసుకోవాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు రాలిపోకుండా ఉంటుంది. దాంతో వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.
 
కీరదోస రసంలో క్యాల్షియం, సోడియం, సిలికాన్ వంటి పదార్థాలు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ రసాన్ని జుట్టుకు రాసుకుంటే జుట్టు పెరగడమే కాకుండా మృదువుగా మారుతుంది. అలానే కీరదోస రసంలో కొద్దిగా తేనె, కాఫీ పొడి కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. అరగంట తరువాత స్నానం చేస్తే చర్మం ఇన్‌ఫెక్షన్స్ తొలగిపోయి తాజాగా మారుతుంది. 
 
కీరదోస విత్తనాలలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించుటకు ఉపయోగపడుతాయి. అధిక బరువును కూడా తగ్గిస్తాయి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కీరదోసలోని విటమిన్ బి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగిస్తుంది. తలనొప్పితో బాధపడేవారు కీరదోస మిశ్రమాన్ని రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.