మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (15:14 IST)

కలబంద గుజ్జు.. బాదం పౌడర్‌తో సౌందర్యం ఎలా?

మోచేతులు, మోకాళ్లు నల్లబడితే కలబందను ఉపయోగిస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చర్మంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది. కలబంద గుజ్జు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మోచేతులు, మోకాళ్లు నల్లబడితే కలబందను ఉపయోగిస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చర్మంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది. కలబంద గుజ్జు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కలబంద చర్మానికి మెరుపునిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం, క్యాన్సర్‌ రాకుండా చూడటంలోనూ కలబంద ఉపయోగపడుతుంది. 
 
అలోవిరా గుజ్జును రాసి మోచేతులకు రాసుకుని అరగంట తర్వాత కడిగేయడం ద్వారా మంచి ఫలితం వుంటుంది. నిమ్మలో వుండే విటమిన్-సి మృత చర్మ కణాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా నల్లగా ఉన్న మోకాలు, మోచేతి భాగాల్లో నిమ్మరసం రాసి 15 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి. తర్వాత లోషన్‌ రాయాలి. మరింత మెరుగైన ఫలితం కోసం తేనె కలపవచ్చు. 
 
అలాగే రాత్రి నిద్రించే ముందు బాదం నూనెను మోకాళ్లకు, మోచేతులకు నిద్రించడం ద్వారా మంచి ఫలితం వుంటుంది. రెండు టేబుల్‌ స్పూన్ల ఆల్మాండ్‌ పౌడర్‌, పెరుగును కలిపి పేస్టులా రాసుకున్నా మంచి ఫలితం వుంటుంది.