శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (16:09 IST)

తేనెతో ప్యాక్ వేసుకుంటే..?

బొప్పాయి ఆరోగ్యానికి టానిక్‌లా ఉపయోగపడుతుంది. మరి అందానికి ఎలా పనిచేస్తుందో చూద్దాం.. బొప్పాయి గుజ్జులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెుటిమలు తొలగిపోయి తాజాగా మారుతుంది.
 
పాలలో కొద్దిగా చక్కెర, ఉప్పు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. బార్లీ గింజలను పొడిగా చేసుకుని అందులో నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన ముఖంపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
తేనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ అందానికి చాలా ఉపయోగపడుతాయి. అందువలన తేనెలో కొద్దిగా పాలు, ఉప్పు, వంటసోడా కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోయి తాజాగా మారుతుంది.