శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (13:06 IST)

ఓట్స్ పొడి, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండాలి. అంటే పోషక విలువలు ఎక్కువగా లభించే యాపిల్, నిమ్మకాయ, జామ, చేపలు, ఆకుకూరల వంటివి తీసుకోవాలి. ఇవన్నీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో అందం కూడా అంతే ముఖ్యం.
 
కానీ కొందరైతే ఈ రెండింటిని అసలు పట్టించుకోరు. ముఖ్యంగా చాలామందికి కంటి కింద నల్లటి వలయాలు ముఖం అందం కోల్పోయేలా చేస్తాయి. అందుకు కారణం ఒతత్డి, నిద్రలేమి వలనే. అందువలన ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.
 
ఓట్స్ పొడిలో కొద్దిగా నిమ్మరసం, తేనె, పాలు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటి కిందటి నల్లటి వలయాలకు రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.