శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (12:53 IST)

చుండ్రు సమస్యకు చెక్ పెట్టే.. వెల్లుల్లి రసం..

వెల్లుల్లిని వంటకాల్లో ఉపయోగిస్తారు. వెల్లుల్లి అందానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. కానీ దీని గురించి ఎవ్వరికి అంతగా తెలియదు. ఈ చిట్కాలు తెలుసుకుంటే అసలు వెల్లుల్లిని వదలరు. మరి అవేంటో తెలుసుకుందాం..
 
వెల్లుల్లిలోని సల్ఫర్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని నూట్రియన్స్ జుట్టు రాలకుండా చేస్తాయి. వెల్లుల్లి రసాన్ని తలకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు ఎక్కువగా ఉందని బాధపడుతున్నారా.. ఇలా చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
 
వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ వెల్లుల్లి రసంలో కొద్దిగా నిమ్మరసం కలపి ప్రతిరోజూ తలకు రాసుకుంటే చుండ్రు సమస్య తొలగిపోతుంది. అంతేకాకుండా వెంట్రుకలు మృదువుగా కూడా మారుతాయి. ఎక్కువగా జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. వద్దూ వద్దూ... ఇలా చేస్తే చాలు...
 
వెల్లుల్లిలోని విటమిన్ ఇ, సెలీయం జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. ఎలా అంటే.. వారానికి మూడుసార్లు వెల్లుల్లి మిశ్రమాన్ని తలకు రాసుకుని గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. శరీరంలో విటమిన్స్ అధికంగా లేకపోవడం వలన దాని ప్రభావం జుట్టుపై చూపిస్తుంది. అందువలనే వెంట్రుకలు రాలుతున్నాయి.. కనుక ఇలా చేయడం మరచిపోకండి..