సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (14:33 IST)

జగన్ దాడిపై శ్రీరెడ్డి స్పందన.. బుర్ర తక్కువదానా అంటూ నెటిజన్లు ఫైర్

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా ఖండించింది. అయితే ఆమె చేసిన పోస్టుపై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జగన్ అన్నకు ఏమైంది. రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. 
 
అలాంటి వ్యక్తి మీద ప్రతిపక్షాలు దాడులు చేయడం ఏంటి? దమ్ముంటే జగన్‌ను ధైర్యంగా ఎదుర్కొనాలి. అంతేకానీ జనం కోసం పోరాడుతున్న జగన్‌పై ఇలాంటి దాడులు చేయడం తప్పు. జగనన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాంటూ ట్వీట్ చేసింది. 
 
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లంతా.. శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు. జగన్ ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నేతగానే ఉన్నారని గుర్తుచేశారు. అది కూడా తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే.. టీడీపీ వాళ్లు డబ్బులిచ్చి ప్రతిపక్షాలు అని చెప్పమన్నారా? బుర్ర తక్కువదానా అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.