జగన్‌పై దాడి చేసిన వ్యక్తికి.. పలువురితో వివాహేతర సంబంధాలున్నాయట..
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి చేసిన శ్రీనివాసరావుపై నేర చరిత్ర వుంది. గతంలోనే అతడిపై పోలీసు కేసులు నమోదైనాయి. కోడిపందాలపై ప్రేమతో చదువుకు మంగళం పాడేసిన శ్రీనివాసరావు, కూలీ పనులు చేసుకుని కాలం గడుపుతుండే తాతారావు, సావిత్రిల ఐదో సంతానం. ఠాణేలంకలో పదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్నాడు.
గత సంవత్సరం కాగిత వెంకటేశ్ అనే యువకుడిపై దాడి చేశాడని ముమ్మిడివరం పోలీసు స్టేషన్‌లో ఓ కేసు నమోదై ఉంది. ఇక శ్రీనివాసరావుకు గ్రామంలోని పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయమై గ్రామపెద్దలు పలుమార్లు శ్రీనివాసరావును మందలించినట్టు స్థానికులు అంటున్నారు.
ఇక వైజాగ్ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్‌పై దాడికి దిగిన శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన తరువాత, అతని వద్ద నుంచి 11 పేజీల లేఖను స్వాధీనం చేసుకున్న అధికారులు, దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖలో శ్రీనివాసరావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఘటన తరువాత తనకేదైనా ప్రాణహాని జరిగితే, తన అవయవాలను దానం చేయాలని తన తల్లిదండ్రులకు విన్నవించుకున్నాడు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకెంతో అభిమానమని, చంద్రబాబు పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని చెప్పుకొచ్చాడు. జగన్ అధికారంలోకి వస్తే, అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరించాడు. ఒకసారి లబ్ధి పొందిన వారే, మళ్లీ మళ్లీ లబ్ది పొందుతున్నారని ఆరోపించాడు. పేదలకు ఏ విధమైన పథకాలూ అందడం లేదని ఆరోపించాడు. చివరిలో శ్రీనివాసరావు తన సంతకాన్ని కూడా చేయగా, సీఐఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ సంతకాలతో లేఖను అధికారులు ధ్రువీకరించారు.