సమాజం కోసం పెళ్ళి చేసుకోవడం నా వల్ల కాదు.. వరలక్ష్మి
సమాజం కోసం పెళ్లి చేసుకోవడం తన వల్ల కాదని.. వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపింది. అవతల వ్యక్తిపై ప్రేమనేది లేకుండా.. ఇంట్లోని వారి కోసమో, లేకుంటే సమాజం కోసం తాను పెళ్లి చేసుకోనని వరలక్ష్మి క్లారిటీ ఇచ్చింది. తన అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువనిచ్చే వ్యక్తే తన జీవితంలోకి వస్తాడని.. లేకుంటే ఇలా ఒంటరిగానే వుండిపోతానని వరలక్ష్మి చెప్పింది.
ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ.. తనలో ప్రేమ అనే ఫీలింగ్ వచ్చిందని చెప్పింది. కానీ అది పోయింది కూడా. ఒక మగాడు పెళ్లి తరువాత తన జాబ్ వదులుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు, తాను మాత్రం పెళ్లి కోసం జాబ్ ఎందుకు వదిలేయాలి? అంటూ ప్రశ్నించింది.
పెళ్లి అనేది మహిళలకు అదేదో లక్ష్యం కాదని.. వేస్ట్ ఆఫ్ టైమని వరలక్ష్మి చెప్పింది. రాజకీయాల్లోకి రావాలనేది ఓ లక్ష్యమని అంతేగానీ.. పురుషుడి నమ్ముకుని మహిళ వుండాల్సిన అవసరం లేదని తెలిపింది. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని, కెరీర్‌ను తీర్చిదిద్దుకుని.. ఇతరులపై ఆధారపడకుండా నిలవాలని.. అవన్నీ పూర్తయ్యాక.. ఎవర్నైనా ప్రేమిస్తే వారితో చిరకాలం వుండాలనిపిస్తే పెళ్లి చేసుకోవచ్చునని వరలక్ష్మి తెలిపింది.