సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (15:23 IST)

నా రెండో పెళ్లి మమ్మీడాడీల ఇష్టప్రకారమే... : అమలాపాల్

అటు తెలుగుతో పాటు ఇటు తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అమలాపాల్. ఈమె దర్శకుడు విజయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కొన్వి నెలలకే పెటాకులైంది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమలా పాల్ సినిమాల్లో బిజీ అయిపోయారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా తన రెండో పెళ్లిప అమలా పాల్ కామెంట్స్ చేసింది... 'ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా నా కెరియర్ పైనే వుంది. ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. మొదటిసారి వివాహం నా నిర్ణయం వల్ల జరిగింది. కానీ అది ఎక్కువ కాలం నిలబడలేదు. అందువలన ఈ సారి నా పెళ్లి నిర్ణయాన్ని మా అమ్మానాన్నలకే వదిలేశాను. వాళ్లు నా మంచినే కోరుకుంటారుగనుక, ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్లనే చేసుకుంటాను' అని సమధానమిచ్చింది.