సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (09:43 IST)

అమలా పాల్ ''ఆడై'' ఫస్ట్ లుక్ రిలీజ్

ఇద్దరమ్మాయిలతో సినిమా హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటోంది. పెళ్లికి తర్వాత భర్తకు విడాకులిచ్చి.. సినిమాల్లో నటిస్తున్న అమలాపాల్.. తాజాగా ఆడై అనే సినిమాలో నటిస్తుంద

ఇద్దరమ్మాయిలతో సినిమా హీరోయిన్ అమలా పాల్ ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటోంది. పెళ్లికి తర్వాత భర్తకు విడాకులిచ్చి.. సినిమాల్లో నటిస్తున్న అమలాపాల్.. తాజాగా ఆడై అనే సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ ఫస్ట్ లుక్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. దెబ్బలు తగిలి రక్తం కారుతూ.. పెద్దగా ఏడుస్తూ ఒక ఇనుప రాడ్‌ను చేతులో పట్టుకుని ఎడమ మోకాలును నెలకు ఆనించి కూర్చుంది. ఇక బట్టలంతా చిరిగిపోయి ఉన్నాయి. అవి దుస్తుల్లా కనిపించవు. 
 
చిరిగిన గుడ్డ పేలికలను శరీర భాగాలకు చుట్టుకుని కనిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు విడుదల చేయగా గంటలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అమలా పాలే పోషిస్తోంది. రత్న కుమార్ ఈ సినిమాకు దర్శకుడు.