శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (10:00 IST)

అమ్మాయిలను ఓరకంటితో చూసే మహర్షి.. ఎవరబ్బా..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆయన కొత్త సినిమా టీజర్ రిలీజైంది. కాలేజీ స్టూడెంట్ లుక్‌లో మహేష్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లో ఇది 25వ సినిమ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆయన కొత్త సినిమా టీజర్ రిలీజైంది. కాలేజీ స్టూడెంట్ లుక్‌లో మహేష్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్‌లో ఇది 25వ సినిమా. మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. గురువారం ఉదయం మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్‌ను అవుట్  చేశారు. ఈ సినిమాకు ''మహర్షి'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
 
హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ అంటూ ప్రారంభమయ్యే టీజర్‌లో మీట్ రిషి అంటూ క్యాప్షన్ ఇచ్చి మహేష్ కాలేజీకి వెళుతున్న దృశ్యాన్ని చేర్చారు. హాఫ్ హ్యాండ్స్ చెక్స్ షర్ట్ వేసుకుని స్టయిల్‌గా మహేష్ నడిచి వస్తూ... అమ్మాయిలను ఓర కన్నుతో చూడటం వంటి సన్నివేశాలు బాగున్నాయి. 
 
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.