సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 6 ఆగస్టు 2018 (22:07 IST)

ప్రిన్స్ మహేష్ బాబు పోలీసులకు రిక్వెస్ట్...

సినీనటుడు మహేష్‌ బాబు తాజాగా పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. అసలు మహేష్ బాబు పోలీసులకు ఎందుకు కలిశారు. సమస్య ఏంటో అర్థం కాక మహేష్ బాబు అభిమానులు తెగ కంగారుపడిపోయారు. షూటింగ్ కోసం మాత్రమే పోలీసులను మహేష్ బాబు కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బా

సినీనటుడు మహేష్‌ బాబు తాజాగా పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. అసలు మహేష్ బాబు పోలీసులకు ఎందుకు కలిశారు. సమస్య ఏంటో అర్థం కాక మహేష్ బాబు అభిమానులు తెగ కంగారుపడిపోయారు. షూటింగ్ కోసం మాత్రమే పోలీసులను మహేష్ బాబు కలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 25వ సినిమా చేస్తున్నారు. అగ్ర నిర్మాతలు అశ్వనీదత్, దిల్ రాజులు ఇద్దరూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ డెహ్రాడూన్‌లో పూర్తిచేయబోతున్నారు. రెండవ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరపాల్సి ఉంది.
 
హైదరాబాద్‌లోని తెలంగాణా పోలీస్ అకాడమీలో షూటింగ్ జరగాల్సి ఉంది. దీంతో తమకు షూటింగ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను స్వయంగా మహేష్ బాబు కలిసి రిక్వెస్ట్ చేశారట. మహేష్ లాంటి అగ్రహీరో వచ్చి రిక్వెస్ట్ చేస్తే పోలీసులు కాదంటారా. వెంటనే ఒప్పుకున్నారట. 
 
ఒకరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే ఇదే విషయంపై పోలీసులతో మహేష్ బాబు మాట్లాడటం, అలాగే షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ప్రాంతాలను చూస్తే అక్కడే ఉండిపోవడంతో అభిమానులందరిలోను భయాందోళనకు మొదలైందట. మహేష్ బాబును అరెస్టు చేశారేమోనన్న తెగ భయపడిపోయారట. అయితే మహేష్ బాబు బయటకు వచ్చి షూటింగ్ కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారట.