మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: సోమవారం, 6 ఆగస్టు 2018 (21:51 IST)

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాలో బాల‌కృష్ణ‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న తాజా చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న తాజా చిత్రం అర‌వింద స‌మేత‌. వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. మ‌రో హీరోయిన్ ఇశా రెబ్బా కూడా న‌టిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 
ఇదిలావుంటే.. ఈ సినిమాలో ఆద‌ర్శ బాల‌కృష్ణ న‌టిస్తున్నాడ‌ట‌. అతిథి పాత్ర అయిన‌ప్ప‌టికీ.. ఎన్టీఆర్ సినిమాలో న‌టిస్తుండ‌టంతో త‌న క‌ల నిజ‌మైంది అంటూ సంతోషం వ్యక్తం చేసాడు ఆద‌ర్శ బాల‌కృష్ణ‌. హైద‌రాబాద్ శివార్లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎ.ఎస్.థమ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నుందో చూడాలి.