మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: సోమవారం, 6 ఆగస్టు 2018 (22:19 IST)

దేవ‌దాస్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేస్తోంది..!

కింగ్ నాగార్జున, నేచుర‌ల్ స్టార్ నానిల కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్.ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తోన్న‌ ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల విడు

కింగ్ నాగార్జున, నేచుర‌ల్ స్టార్ నానిల కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్.ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తోన్న‌ ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టైటిల్‌ లోగోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో నాగార్జున, నానిల సరసన ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే... ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా నాగార్జున, నాని తమ అభిమానులకు శుకాంక్షలు తెలిపి దేవదాస్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ఈ నెల 7న  సాయత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగ్ డాన్ పాత్రలో నటిస్తుండగా, నాని డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.