శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: సోమవారం, 30 జులై 2018 (20:07 IST)

అడవి శేష్ 'గూఢచారి' చిత్రం టాలీవుడ్ చిత్రమేనా? డౌటుగా వుందట...

అడివి శేష్ న‌టించిన తాజా చిత్రం గూఢ‌చారి. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నినూత‌న ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క తెర‌కెక్కించారు. ఇటీవ‌ల నేచుర‌ల్ స్టార్ నాని రిలీజ్ చేసిన ఈ మూవీ టీజ‌ర్‌కు అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త‌క్కువ టైమ

అడివి శేష్ న‌టించిన తాజా చిత్రం గూఢ‌చారి. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నినూత‌న ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క తెర‌కెక్కించారు. ఇటీవ‌ల నేచుర‌ల్ స్టార్ నాని రిలీజ్ చేసిన ఈ మూవీ టీజ‌ర్‌కు అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త‌క్కువ టైమ్‌లోనే ఈ ట్రైల‌ర్‌కు 1మిలియ‌న్ వ్యూస్ రావ‌డం విశేషం. ఈ స్పై థ్రిల్లర్ ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
 
ఈ ట్రైల‌ర్ చూసిన వాళ్లంద‌రు అనే మాట‌.. ఇది టాలీవుడ్ మూవీనా..? లేక హాలీవుడ్ మూవీనా..? అని. ఎందుకంటే... ప్ర‌తి ఫేమ్ చాలా రిచ్‌గా, ఒక హాలీవుడ్ మూవీ చూసిన ఫీలింగ్ క‌లిగించేలా విజువ‌ల్స్ ఉండ‌డం విశేషం. ఫ‌స్ట్ లుక్ పోస్టర్, టీజ‌ర్, ట్రైల‌ర్.. ఇలా అన్నింటిలో డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న్స్‌తో దూసుకెళుతోన్న గూఢ‌చారి ఆగ‌ష్టు 3న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మొబైల్స్ వ్యాన్స్‌లో గూఢ‌చారి చిత్రాన్ని డిఫ‌రెంట్‌గా ప్ర‌మోట్ చేస్తోంది. యూత్‌కి కాంపిటేష‌న్స్ కూడా నిర్వ‌హించి స‌ర్‌ఫ్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇస్తూ యూత్‌ని బాగా ఆక‌ట్టుకుంటోంది. మ‌రి... అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే గూఢ‌చారి అంద‌ర్నీ ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంద‌ని ఆశిద్దాం.