శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: సోమవారం, 30 జులై 2018 (16:29 IST)

ఐటెం సాంగ్ పూర్తిచేసుకున్న 'డ్రైవర్ రాముడు' శకలక శంకర్

కమెడియన్‌గానే కాకుండా హీరోగా కూడా దూసుకుపోతున్న నవ్వుల వీరుడు షకలక శంకర్. తాను హీరోగా నటించిన శంభో శంకర చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అంతే ఉత్సాహంగా డ్రైవర్ రాముడు సినిమాని శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. నానక్‌రామ్‌గూడా లోని రామానాయుడు స్టూడియోస్‌

కమెడియన్‌గానే కాకుండా హీరోగా కూడా దూసుకుపోతున్న నవ్వుల వీరుడు షకలక శంకర్. తాను హీరోగా నటించిన శంభో శంకర చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అంతే ఉత్సాహంగా డ్రైవర్ రాముడు సినిమాని శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. నానక్‌రామ్‌గూడా లోని రామానాయుడు స్టూడియోస్‌లో భారీ సెట్లో పవన్ కళ్యాణ్ నటించిన కెమరామెన్ గంగతో రాంబాబు, రామ్ చరణ్ హీరోగా నటించిన ఎవడు, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన బాహుబలి లాంటి సినిమాలో తన అంద చందాలతో ఉర్రూతలూగించిన స్కార్లెట్ విల్సన్‌తో షకలక శంకర్ ఒక్క ఐటెం సాంగ్‌కి చిందులేశాడు. యువతని ఉర్రూతలూగించే ఈ ఐటెం సాంగ్‌కి శివశంకర్ మాస్టర్ తన స్టెప్పులు అందించారు. 
 
ఈ సందర్భంగా షకలక శంకర్ మాట్లాడుతూ "హీరోగా నా మొదటి సినిమా శంభో శంకరని విజయం చేసిన ప్రతిఒక్కరికి నా కృతఙ్ఞతలు. డ్రైవర్ రాముడు నా రెండో సినిమా. మొదటి సినిమా శంభో శంకర కన్నా చాల అద్భుతంగా వస్తుంది. ఈ సినిమా మీ అంచనాలకు మించి ఉంటుంది. నిర్మాతలు, దర్శకుడు ఎక్కడ దేనికి వెనుకాడకుండా సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు ఐటెం సాంగ్ చేస్తున్నాము. ఎన్నో సినిమాలకి పనిచేసిన శివ శంకర్ మాస్టర్ దర్శకత్వంలో ఈ ఐటెం సాంగ్ చేయటం నాకు చాలా సంతోషం. ఈ సినిమాతో అందరిని అలరిస్తానని నమ్మకం నాకుంది" అని తెలిపారు. 
 
డాన్స్ మాస్టర్ శివ శంకర్ మాట్లాడుతూ "తమిళంలో చాలా సినిమాలు చేసిన తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. తెలుగు సినెమాలవల్లే నాకు ఇంత మంచిపేరు వచ్చింది. నేను ఇప్పుడు హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యాను. ఈ పాట నాకిచ్చిన దర్శకనిర్మాతలకి నా కృతజ్ఞతలు. చాల మంచి పాట చాలా బాగా వస్తుంది" అని తెలిపారు.
 
స్కార్లెట్ విల్సన్ మాట్లాడుతూ "మళ్లీ తెలుగు సినిమా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. డ్రైవర్ రాముడులో ఐటెం సాంగ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. శివ శంకర్ మాస్టర్ నా కెరీర్లో బెస్ట్ కొరియోగ్రాఫర్. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. దర్శకుడు, నిర్మాతకి నా కృతజ్ఞతలు" అని తెలిపారు. 
 
దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ "డ్రైవర్ రాముడు అనేది పెద్ద ఎన్టీఆర్ గారి సినిమా టైటిల్. ఆ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని ఖచ్చితంగా చెపుతున్నాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు, ఈ సినిమా కూడా అంత విజయం సాధిస్తుంది అని ఆశిస్తున్నాము. పెద్దపెద్ద సినిమాలో నటించిన స్కార్లెట్ విల్సన్ మా సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది. ఈ పాటకి శివశంకర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. షకలక శంకర్ నటన, కథ, కథాంశం అద్భుతంగా ఉంటుంది. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది" అని అన్నారు.