శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: గురువారం, 2 ఆగస్టు 2018 (19:53 IST)

నెగటివ్ ఫీలింగుతోనే చి.ల.సౌ సినిమా చూశా: నాగార్జున

సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం చి||ల||సౌ. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న సినిమా

సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం చి||ల||సౌ. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా నాగార్జున అక్కినేని మాట్లాడుతూ… చైతన్య నన్ను చి..ల..సౌ సినిమా బాగుంది చూడమన్నాడు. ఏముంటుందిలే అని నెగెటివ్ ఫీలింగ్‌తో సినిమా చూశా. సినిమా స్టార్ట్ అయినా 5 నిముషాలకే స్టోరీ కి కనెక్ట్ అయిపోయా. సినిమా చాలా బాగుంది. సుశాంత్ కి ఇది పర్ఫెక్ట్ ఫిలిం. బాగా చేశాడు. రాహుల్ డైరెక్ట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. 
 
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పెర్ఫార్మన్సెస్ అన్నీ బాగున్నాయి. సినిమా బాగా నచ్చి అన్నపూర్ణ బ్యానర్ లో చేస్తున్నాం. సుశాంత్ మా ఫామిలీ మెంబెర్ కనుక సపోర్ట్ చేద్దామని నేను ఈ ఫిలిం కి ప్రొడ్యూసర్ గా జాయిన్ అవలేదు. ఒక మంచి సినిమాలో నేనూ ఒక భాగం అవ్వాలని అన్నపూర్ణ బ్యానర్ లో చేశాం. చి..ల..సౌ లాంటి సినిమాని విడుదల చేయడం చాలా గర్వంగా ఉంది. తప్పకుండా అన్నపూర్ణ బ్యానర్లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాను. చి..ల..సౌ చాలా మంచి సినిమా. అందరి ఆదరణా పొందుతుందని నా నమ్మకం. 
 
మహానటి, రంగస్థలం లాంటి మంచి సినిమాలు రైటింగ్ వలన బాగా ఆడాయి. అలా చి..ల..సౌ కూడా రైటింగ్ చాలా బాగుంది. హీరోయిన్ రుహాని బాగా చేసింది. కంటెంట్ బాగుంది మంచి సినిమా చేయగలమన్న నమ్మకం ఉన్న న్యూ టాలెంట్‌తో అన్నపూర్ణ బ్యానర్ చేతులు కలపడానికి సిద్ధంగా ఉంది అనడానికి నాంది చి..ల..సౌ అని తెలియ‌చేసారు.