బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 8 ఆగస్టు 2018 (08:32 IST)

దేవ‌దాస్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌.. సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌

సి.ధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ `దేవ‌దాస్‌`. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌

సి.ధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ `దేవ‌దాస్‌`. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సెప్టెంబ‌ర్ 1న శుభ‌ల‌గ్నం, సెప్టెంబ‌ర్ 27న స్టూడెంట్ నెం.1, సెప్టెంబ‌ర్ 28న చిరుత సినిమాలు విడుద‌లై ఘ‌న విజ‌యాన్నిసాధించాయి. అశ్వ‌నీద‌త్‌కు ఎంతో క‌లిసొచ్చిన సెప్టెంబ‌ర్ నెల చివ‌రి వారం అంటే.. సెప్టెంబ‌ర్ 27న `దేవ‌దాస్‌` ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని ఈ ఫ‌స్ట్‌లుక్‌ను త‌మ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు.
 
ఈ సంద‌ర్భంగా... `టైటిల్ ప్ర‌కారం నా ప‌క్క‌న పారు ఉండాలి. కానీ నా ప‌క్క‌న ఈ దాసుగాడు ఉన్నాడు. దేవ‌దాస్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. సినిమా ఫ‌న్ రైడ్‌గా ఉంటుంది`` అంటూ ట్విట్ట‌ర్ ద్వారా ఫ‌స్ట్ లుక్‌ను నాగార్జున విడుద‌ల చేశారు. ``1996లో `నిన్నేపెళ్లాడ‌తా` విడుద‌లైన‌ప్పుడు నాగ్ సార్ స్క్రీన్‌పై ఉంటే నేను దేవి 70 ఎం.ఎం థియేట‌ర్ క్యూలో ఉన్నాను. 2018లో ఇద్ద‌రం క‌లిసి దేవ‌దాస్ ఫ‌స్ట్‌లుక్‌లో ఉన్నాం`` అంటూ నేచుర‌ల్ స్టార్ నాని ట్విట్ట‌ర్ ద్వారా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.
 
చిత్ర నిర్మాత అశ్వ‌నీద‌త్ చ‌ల‌సాని మాట్లాడుతూ - ``క్లైమాక్స్ మిన‌హా `దేవ‌దాస్` షూటింగ్ పూర్త‌య్యింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 27న భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తాం`` అన్నారు. కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని, ర‌ష్మిక మండ‌న్నా, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వి.కె, బాహుబ‌లి ప్రభాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: మోహ‌న్, ఛీఫ్ కో ఆర్డినేటర్: స‌దాశివ‌రావ్, కొరియోగ్ర‌ఫి: బృందా, ప్రేమ్ ర‌క్షిత్, శేఖ‌ర్ మాస్ట‌ర్, మాట‌లు: వెంక‌ట్ డి పాటి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సాహి సురేష్, సంగీత ద‌ర్శ‌కుడు: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫ‌ర్: స‌్యామ్ ద‌త్ సైనూదీన్, నిర్మాత‌: అశ్వినీద‌త్ చ‌ల‌సాని, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌రామ్ ఆదిత్య‌.