శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (22:33 IST)

'డీఎంకే సూరీడు' నల్ల కళ్లద్దాలను ఎందుకు ఇష్టపడతారు...

డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి నల్ల కళ్ళద్దాలు అంటే ఎంతో ఇష్టం. ఈ స్టైల్‌ను అనేక మంది ఫాలో అవుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో ఉన్నా... ఇంటి నుంచి కాలు బయటపెట్టినా.. నిరంతరం కళ్ళకు నల్లద్

డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి నల్ల కళ్ళద్దాలు అంటే ఎంతో ఇష్టం. ఈ స్టైల్‌ను అనేక మంది ఫాలో అవుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో ఉన్నా... ఇంటి నుంచి కాలు బయటపెట్టినా.. నిరంతరం కళ్ళకు నల్లద్దాలు ఉండాల్సిందే. ఆయన కేవలం నల్లద్దాలనే ఎందుకు ఇష్టపడేవారో ఇపుడు తెలుసుకుందాం...
 
1960లలో కరుణానిధి ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఎడమ కన్నుకి గాయమైంది. అపుడు ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. నల్లద్దాలను ఉపయోగించాలని సూచించారు. అప్పటి నుంచి ఆయన నల్ల కళ్లద్దాలను ధరిస్తూ వచ్చారు. అలా 46 ఏళ్ల పాటు వాటిని ధరించినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ వెల్లడించారు. 
 
ఇక్కడ విశేషం ఏంటంటే.. కరుణ.. ఒకనాటి ఆయన ప్రాణస్నేహితుడు ఎంజీఆర్.. ఇద్దరూ నల్లకళ్లద్దాలనే ధరించేవారు. వాటికి ఈ ఇద్దరూ తమిళనాట బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారంటే అతిశయోక్తి కాదు.