మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: సోమవారం, 6 ఆగస్టు 2018 (22:22 IST)

అఖిల్ మూవీ లుక్ వ‌చ్చేస్తోంది..!

అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న మూడ‌వ సినిమా ఇటీవ‌ల లండ‌న్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. భారీ చిత్రాల నిర్మా

అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న మూడ‌వ సినిమా ఇటీవ‌ల లండ‌న్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అఖిల్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి మిస్ట‌ర్ మ‌జ్ను అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఈనెల 29న నాగార్జున పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. ఇటీవ‌లే లండన్ నుంచి హైద‌రాబాద్ చేరుకున్న టీమ్ త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో తాజా షెడ్యూల్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. అఖిల్ క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని  యూత్ కి బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని చిత్ర‌యూనిట్ చాలా న‌మ్మ‌కంగా చెబుతున్నారు. ద‌స‌రాకి రిలీజ్ చేయాల‌నుకున్నప్ప‌టికీ కుద‌ర‌డం లేదు. క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.