సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఆగస్టు 2018 (14:54 IST)

సినిమా కోసం మృగంగా మారిన మలయాళ సూపర్‌స్టార్

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్‌కు సినిమా అంటే ఎంత ప్రాణమో ఈ ఒక్క సన్నివేశంతో ఇట్టే తెలుసుకోవచ్చు. ఒక చిత్రం కోసం ఆయన ఏకంగా జంతువుగా మారిపోయారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆకట్

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్‌కు సినిమా అంటే ఎంత ప్రాణమో ఈ ఒక్క సన్నివేశంతో ఇట్టే తెలుసుకోవచ్చు. ఒక చిత్రం కోసం ఆయన ఏకంగా జంతువుగా మారిపోయారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
 
మోహన్ లాల్ తాజా చిత్రం 'ఒడియన్'. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేయగా, అది ఎంతగానో ఆసక్తి రెలెత్తిస్తోంది. పురాతనమైన ఒడియన్ కమ్యూనిటీ ఆధారంగా తీసిన ఈ సినిమాలో మోహన్‌లాల్ కొన్ని ప్రత్యేక శక్తులున్న వ్యక్తిగా కనిపించనున్నారు. 
 
అవసరాన్ని బట్టి ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపానికి మారిపోయే క్యారెక్టర్‌లో ఈ హీరో నటిస్తున్నారు. ఈ రూపాల్లో భిన్న వయస్కుల రూపాలతో పాటు జంతు రూపాలు కూడ ఉంటాయట. 
 
ఇందుకోసం విఎఫ్ఎక్స్ వర్క్స్‌ను ఉపయోగించారు. ఈ విఎఫ్ఎక్స్ వర్క్ మొత్తాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్‌కు ఎన్వై విఎఫ్ఎక్స్ వాలా కంపెనీ చేస్తోంది. వీఏ శ్రీకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అక్టోబరు నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.