శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 16 నవంబరు 2017 (16:00 IST)

UC బ్రౌజర్ ఔట్... Firefox న్యూ లుక్... చాలా వేగం గురూ...

వచ్చిన కొద్దిరోజుల్లోనే భారతదేశంలో కోటిమంది యూజర్లను కైవసం చేసుకున్న UC బ్రౌజర్ ప్రస్తుతం గూగుల్ ప్లే నుంచి మాయమైంది. ఐతే దీనికి పలు కారణాలను చెపుతున్నారు. చైనాకు సంబంధించిన ఈ యూసీ బ్రౌజర్ యాప్ ద్వారా భారతీయుల డేటాను చైనా తస్కరిస్తోందన్న ఆరోపణలు వచ్చ

వచ్చిన కొద్దిరోజుల్లోనే భారతదేశంలో కోటిమంది యూజర్లను కైవసం చేసుకున్న UC బ్రౌజర్ ప్రస్తుతం గూగుల్ ప్లే నుంచి మాయమైంది. ఐతే దీనికి పలు కారణాలను చెపుతున్నారు. చైనాకు సంబంధించిన ఈ యూసీ బ్రౌజర్ యాప్ ద్వారా భారతీయుల డేటాను చైనా తస్కరిస్తోందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపధ్యంలో దీనిని గూగుల్ ప్లే నుంచి తొలగించారని అంటున్నారు. అలాగే డేటా కూడా పక్కదారి పట్టించేవిధంగా వుందన్న ఆరోపణల నేపధ్యంలో దీనిని గూగుల్ ప్లే నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఐతే యూసీ బ్రౌజర్ మినీ, యూసీ న్యూస్ మాత్రం అందుబాటులోనే వున్నాయి. కాగా యూసీ బ్రౌజర్ ఎంతో కాలం వుండదంటూ గతంలోనే గూగుల్ ప్లే పలుమార్లు సూచనలు, హెచ్చరికలు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు.
 
మరోవైపు ఫైర్ ఫాక్స్ అప్‌డేట్ అయ్యింది. బ్రౌజర్లలో అత్యంత వేగాన్ని సంతరించుకున్నదంటూ ఆ కంపెనీకి చెందిన అధికారి పేర్కొన్నారు. వీడియోలు, మెయిళ్లు, ఫోటోలు... ఇలా దేన్నయినా నవీకరించబడిన ఫైర్‌ఫాక్స్‌లో అత్యంత వేగంగా శోధన చేసుకోవచ్చని వెల్లడించారు.