బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (14:35 IST)

గూగుల్ ప్లే స్టోర్‌ను ఓపెన్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

గూగుల్ ప్లే స్టోర్‌కు మాల్‌వేర్ అటాక్ అయింది. జేవియర్ అనే వైరస్ అటాక్ అయినట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల గూగుల్ ప్లే స్టోర్‌ను ఓపెన్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తు

గూగుల్ ప్లే స్టోర్‌కు మాల్‌వేర్ అటాక్ అయింది. జేవియర్ అనే వైరస్ అటాక్ అయినట్టు సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల గూగుల్ ప్లే స్టోర్‌ను ఓపెన్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచన చేస్తున్నారు. ఈ మాల్‌వేర్ సోకకుండా మల్టీ లేయర్ సెక్యూరిటీ విధానాన్ని ఉపయోగించాలని కోరింది.
 
గూగుల్ ప్లే స్టోర్‌లో వందలాది అప్లికేషన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 800ల‌కు పైగా అప్లికేష‌న్ల‌లో జేవియ‌ర్ అనే మాల్‌వేర్ ఉంది. యూజ‌ర్ స‌మాచారాన్ని నిశ్శ‌బ్దంగా త‌స్క‌రించే ఈ మాల్‌వేర్ ఫొటో మానిప్యులేట‌ర్‌, వాల్‌పేప‌ర్‌, రింగ్‌టోన్లు వంటి అప్లికేష‌న్ల‌ను డౌన్‌లోడ్ చేయ‌డం వ‌ల్ల ప్ర‌వేశిస్తుంద‌ని ప్ర‌ముఖ సైబ‌ర్ సెక్యూరిటీ కంపెనీ ట్రెండ్ మైక్రో వెల్ల‌డించింది.