శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (12:43 IST)

గూగుల్ ప్లే స్టోర్‌లో "మై జియో యాప్" కొత్త రికార్డు- ఏడాదిలో పది కోట్లమంది డౌన్లోడ్ చేసుకున్నారట..!

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ఖాతాలో మరో రికార్డు పడింది. ''మై జియో'' యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పది కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేసే యాప్స్ ఉచ

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ఖాతాలో మరో రికార్డు పడింది. ''మై జియో'' యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పది కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేసే యాప్స్ ఉచిత డౌన్ లోడ్ లో 'మై జియో' తొమ్మిదో స్థానంలో నిలవడంతో పాటు కేవలం ఏడాది వ్యవధిలోనే జియో ఈ రికార్డును సాధించింది. ఇక జియో మ్యూజిక్, జియో సినిమా, జియో మనీ వ్యాలెట్, జియో చాట్ తదితర యాప్‌లన్నీ కోటికి పైగా డౌన్ లోడ్‌లను సాధించాయి. 
 
భారత్‌లో తయారైన మొబైల్ యాప్‌లలో పది కోట్ల మైలురాయిని తాకిన రెండో యాప్ "మై జియో'' కావడం గమనార్హం. ఈ యాప్‌ను వాడుతూ రిలయన్స్ జియో కస్చమర్లు రీఛార్జ్‌తో పాటు బ్యాలెన్స్ తదితరాలను చెక్ చేసుకోవచ్చు. ఇక మిగిలిన టెలికాం రంగ సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్‌  సంస్థలు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 మిలియన్ల మేరకే డౌన్‌లోడ్లను నమోదు చేసుకున్నాయి.