శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (09:21 IST)

బాలిక బట్టలు విప్పించి 'ప్రైవేట్ పార్ట్‌'లో చేయి పెట్టిన లేడీ టీచర్.. ఎందుకంటే?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల పట్ల ప్రేమగా ఉంటూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విచక్షణకోల్పోయి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తమ వికృత చేష్ట

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల పట్ల ప్రేమగా ఉంటూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విచక్షణకోల్పోయి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తమ వికృత చేష్టలతో విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నారు. తాజాగా మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంగా ఓ విద్యార్థినిని నగ్నంగా చేసి.. ఆ బాలిక ప్రైవేట్ భాగంలో మహిళా ఉపాధ్యాయురాలు చేయి పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. 
 
ఉపాధ్యాయ లోకానికే మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటన రూర్కీలో సంచలనం రేపింది. స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో ఓ బాలిక ఆరో తరగతి చదువుతోంది. ఈ పాఠశాలలో షెఫాలీ అనే ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తోంది. అయితే, ఈ బాలికకు పరీక్షల్లో ఒకటిన్నర మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో ఆ బాలికను ఉపాధ్యాయురాలు కొట్టడమేకాకుండా ఆమె బట్టలు విప్పించి, ప్రైవేట్ భాగాలపై చేతులు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. 
 
దీనిపై బాధిత బాలిక మాట్లాడుతూ... తనకు పరీక్షల్లో ఒకటిన్నర మార్కులు తక్కువగా వచ్చాయని షెఫాలీ మేడం బలవంతంగా తన బట్టలు విప్పించి, తాకరాని చోటల్లా తాకి చిత్రహింసలకు గురిచేసిందనీ బోరున విలపిస్తూ చెప్పింది. కాగా, ఇలాంటి నీచపు చర్యకు పాల్పడిన విద్యార్థిని దుస్తులు విప్పించిన ఉపాధ్యాయురాలు షెఫాలీని తక్షణం సస్పెండ్ చేసినట్టు పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు.