శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 25 అక్టోబరు 2018 (13:17 IST)

అవును.. ఆ దర్శకుడు తాకరాని చోట తాకుతాడు.. అమలా పాల్

ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రసీమల్లో మీటూ చర్చకు దారితీస్తోంది. ఎంతోమంది డైరెక్టర్లు, నిర్మాతల చేతుల్లో హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు హీరోలు కూడా హీరోయిన్లను వేధించినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది హీరోయిన్లు బయటకు వచ్చి వారు ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తుంటే మరికొంతమంది మాత్రం ఆ విషయాన్ని బయటకు చెప్పడంలేదు. 
 
తాజాగా దక్షిణాది హీరోయిన్ అమలా పాల్ ఒక దర్శకుడిపై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో దుమారాన్నే రేపుతున్నాయి. సుశీ గణేషన్ అనే దర్శకుడు తనను కూడా లైంగికంగా వేధించాడని అమలా పాల్ ట్వీట్ చేసింది. గత కొన్ని రోజుల ముందు ఈ దర్శకుడిపై లీనా అనే హీరోయిన్ ఆరోపణలు చేసింది. 
 
దర్శకుడు మద్యం సేవించి ద్వందార్థాలతో హీరోయిన్లతో మాట్లాడుతారని, తాకరాని చోట తాకుతుంటారని అమలాపాల్ చెప్పింది. లీనా చెప్పిన మాటలన్నీ నిజాలేనని ఆమెకు అండగా నిలిచింది అమలాపాల్.