ఆ హీరోకు మీటూ ఉద్యమం బాగా కలిసొచ్చింది..?
దేశమంతా మీటూ ఉద్యమం మారుమ్రోగుతోంది. మీటూ ఆరోపణలు ఎదుర్కొని చాలామంది హీరోలు సినిమాలు చేస్తూ తప్పుకున్న సంధర్భాలు ఉన్నాయి. అయితే రానాలాంటి హీరోలకు మాత్రం మీటూ ఉద్యమం బాగా ఉపయోగపడుతోందట.
మీటూ ఉద్యమం రానాకు బాగా కలిసొచ్చిందట. నానా పటేకర్ పైన హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపణలు చేయడంతో హౌస్‌ఫుల్ నుంచి నానాపటేకర్ తప్పుకున్నారు. మరి నానాపటేకర్ స్థానంలో ఎవరిని తీసుకోవాలన్న విషయంపై ఆలోచించిన సినిమా టీంకు రానాను తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చారట.
మీటూ వల్ల రానా బాగా బెనిఫట్ అయ్యాడు. రానాకు బాలీవుడ్‌లో నటించడం కొత్తేమీ కాదు. హౌస్‌ఫుల్ వంటి సినిమాలో అవకాశం రావడం ప్లస్సే. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరో. ఇంతకుముందు రానా, అక్షయ్ కుమార్‌లు కలిసి ఒక సినిమాలో నటించారు. దీంతో అక్షయ్ కుమార్‌కు ధీటుగా నటించే వ్యక్తే రానా అనే నిర్ణయానికి వచ్చి సినిమా టీం ఈ సినిమాలో అవకాశమివ్వాలన్న నిర్ణయానికి వచ్చేశారట. అక్షయ్ కుమార్ కూడా రానా వైపే మ్రొగ్గుచూపుతున్నారట. ఇప్పటివరకు అవకాశాలు లేకుండా ఉన్న రానాకు ఒక్కసారిగా అవకాశం రావడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.