శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 24 అక్టోబరు 2018 (13:41 IST)

MeToo, అర్జున్ గురించి ఖుష్బూ ఏమ‌ని కామెంట్ చేసిందో తెలుసా..?

మీటూ ఎఫెక్ట్ యాక్ష‌న్ కింగ్ అర్జున్ పైన ఎంత‌లా ప‌డిందో తెలిసిందే. అర్జున్ త‌న‌ని శారీకర‌కంగా, మాన‌సికంగా వేధించాల‌ని చూశాడంటూ శ్రుతి హ‌రిహ‌ర‌న్ చేసిన వ్యాఖ్య‌లు క‌న్న‌డ సీమ‌లో దుమారాన్ని రేపాయి. దీంతో అర్జున్‌కి స‌పోర్ట్ చేసేవారు, అర్జున్‌ని వ్య‌తిరేకించేవారు అని రెండు వ‌ర్గాలుగా విడిపోయిందని చెప్ప‌చ్చు. అర్జున్ ఆమెపై కేసు పెడ‌తాన‌ని చెప్పాడు. ఇదిలాఉంటే... అర్జున్ గురించి త‌మిళ సీనియ‌ర్ న‌టి ఖుష్బూ కామెంట్ చేయ‌డం విశేషం.
 
ఇంత‌కీ ఖుష్బూ ఏం చెప్పిందంటే... అర్జున్ 35 ఏళ్లుగా నాకు తెలుసు. త‌న‌తో చాలా సినిమాలు చేశాను. ఏ ఒక్క‌రోజూ నాతో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించ‌లేదు అని చెప్పారామె. అంతేకాకుండా.. వంద‌లమంది మ‌ధ్య‌లోకి నేను వెళ్లిన ప్ర‌తీసారీ త‌ను న‌న్ను ర‌క్షించాడు. అలాంటి వ్య‌క్తిపై ఇలాంటి విమ‌ర్శ‌లు రావ‌డం నిజంగా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. 
 
అర్జున్‌ని హీరోలా చూసే త‌న కూతుర్లపై ఈ వ్యాఖ్య‌లు ప్ర‌భావం చూపిస్తాయి అన్నారు. త‌న నిజాయ‌తీ నిరూపించుకోవ‌డానికి ఓ అవ‌కాశం ఇవ్వాలి. ఎవ్వ‌రూ ఈ విష‌యంలో తొంద‌ర‌ప‌డొద్దు అంటూ ఓ వీడియోని పోస్ట్ చేసారు ఖుష్బూ. మ‌రి... అర్జున్‌కి స‌పోర్ట్‌గా ఇంకెంతమంది బ‌య‌ట‌కు వ‌స్తారో చూడాలి.