శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 23 అక్టోబరు 2018 (14:46 IST)

వైరముత్తుపై చిన్మయ ఆరోపణలు నిజమేకావొచ్చు... రెహ్మాన్ పేరునూ వాడుకున్నారు...

తమిళ ప్రముఖ సినీ కవి వైరముత్తుపై సినీ నేపథ్యగాయని చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణలు నిజమేకావొచ్చని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సోదరి రెహాన్ అభిప్రాయపడింది. పైగా, తన సోదరుడు రెహ్మాన్ పేరును కూడా వాడుకున్నారనీ ఆమె వ్యాఖ్యానించింది. 
 
వైరముత్తుపై చిన్మయి చేసిన ఆరోపణలపై ఆమె స్పందిస్తూ, అది బహిరంగ రహస్యమేనని, గతంలో తాను అనేక సంఘటనలు గురించి విన్నానని వ్యాఖ్యానించారు. అంతేకాదు, గాయనీమణులను ట్రాప్‌ చేసేందుకు తన సోదరుడు రెహ్మాన్‌ పేరు కూడా వాడుకున్నారని, ఆ విషయాలన్నీ రెహ్మాన్‌కి తెలియవని ఆమె వెల్లడించారు. 
 
వైరముత్తుపై ఆరోపణలు రావడం ఆశ్చర్యకరమేమి కాదని, లేడీ సింగర్స్‌ని ట్రాప్‌ చేసేందుకు రెహ్మాన్‌ పేరును కూడా వాడుకున్నారని అన్నారు. అయితే పరిశ్రమలోని రహస్యాల గురించి రెహ్మాన్‌కు తెలియదని, తన సోదరుడు గాసిప్పులను ఏమాత్రం పట్టించుకోడన్నారు. ఇక వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన ఆరోపణలు నిజమే కావొచ్చని, చిన్మయ చెప్పిన విషయాన్ని తాను నమ్ముతున్నట్టు రెహానా వెల్లడించారు.