20 ఏళ్ల అమ్మాయి ప్రపోజ్ చేస్తే.. రాహుల్ ద్రవిడ్ ఏం చేశాడో తెలుసా? (వీడియో)
దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం పెను సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిర్గతం చేస్తున్నారు. మీ టూ ఉద్యమం ఇలా ప్రముఖులను వణికిస్తున్న వేళ.. ది వాల్ రాహుల్ ద్రవిడ్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ హోటల్ గదిలో ద్రవిడ్‌కు ఓ 20 ఏళ్ల యువతి ప్రపోజ్ చేసింది. అందుకు ద్రవిడ్ నిరాకరించడంతో ఆమె తండ్రిని రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడేలా చేసింది. రాహుల్‌తో కూర్చుని మాట్లాడుతూ వుండిన ఆ యువతి ఉన్నట్టుండి పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చింది. అంతే ద్రవిడ్ లేచి నిలబడి.. నో చెప్పాడు. అయినా ఆ యువతి ఆగలేదు. ఆ వ్యవహారంపై పదే పదే మాట్లాడింది.
అంతే రాహుల్ ద్రావిడ్ అక్కడ నుంచి లేచి, వెళ్లబోయాడు. దీంతో, బయట వేచి ఉన్న తన తండ్రిని పిలిచిన సదరు యువతి, ఆయన చేత పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసింది. అయినా ద్రావిడ్ ఒప్పుకోలేదు. 20 ఏళ్ల వయసులో చదువు, కెరీర్‌పై దృష్టి సారించాలని హితవు పలికాడు. ఇదెప్పుడు జరిగిందో తెలియరాలేదు కానీ.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.