గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: బుధవారం, 31 అక్టోబరు 2018 (17:25 IST)

ఏం చేస్తా... నేను పెళ్లి చేస్కుంటే నా పెళ్లాన్ని వేరేవాడి దగ్గర పడుకోబెట్టాల్సి వస్తది...

జబర్దస్త్ షోలో అమ్మాయిలా నటించే సాయితేజ చివరికి అమ్మాయిగా మారిపోయాడు. అతడు ఆమెలా కావడానికి చాలా కష్టపడ్డాననీ, వేరే దారి లేక విధి లేని పరిస్థితుల్లోనే ఇలా అయిపోయానని సాయితేజ చెప్పుకొచ్చింది. ఇకపై సాయితేజను ఆమె అనాల్సిందే. ఈ నేపధ్యంలో ఆమె చెప్పిన కొన్ని విషయాలు.... నన్ను చూస్తే అబ్బాయిలకు క్రష్ రావచ్చు. సహజంగా అందమైన అమ్మాయిని చూస్తే క్రష్ వస్తది.
 
మెయిల్ టు ఫిమేల్ ఛేంజ్ అవడం అంత ఈజీ కాదు. కానీ అవక తప్పలేదు. ఎందుకంటే నా 15 ఏళ్ల నుంచి నాలో కలిగిన మార్పులే ఇందుకు నిదర్శనం. వయసు పెరిగేకొద్దీ నా ఫీలింగ్స్ చేంజ్ అయిపోయాయి. ఒకవేళ నేను అబ్బాయిలా వున్నా... సారీ నటిస్తూ వుంటే... నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. అలా చేసుకుంటే నా పెళ్లాన్ని వేరేవాడి దగ్గర పడుకోబెట్టాల్సి వస్తది. ఏదో ఒక రోజు విషయం తెలిసిపోతుంది.
 
నా పరిస్థితి నాకు అర్థమైపోయింది. అందుకే నేనిలా మారాను. నన్ను వాక్ చేయమంటే నేను క్యాట్ వాక్ చేస్తాను... కానీ సిక్స్ ప్యాక్ చేయలేను. అలా నన్ను చూస్తే తేడాగాడురా అని గబుక్కున అనేస్తారు. అలా అనిపించుకునే కంటే మారిపోతే బెటర్. ఇలా మారిపోయిన నన్ను నా ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. వీడు మొన్నటి దాకా గెటప్ వేశాడు... అందుకే అలా అయ్యాడు అని అనుకున్నా... నిజంగా నా శరీరం పురుషుడిది కాదు ఆడది అని చెప్పింది.