గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (11:09 IST)

వైఎస్ జగన్ పచ్చినెత్తురు తాగే వ్యక్తి.. ఏపీలో జగన్నాటకం.. కేశినేని నాని

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌పై దాడి కేసులో చంద్రబాబు ఏ-1 అనీ, డీజీపీ ఏ-2 అని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పడాన్ని కేశినేని నాని ఖండించారు.


జగన్నాటకం అనే విషయాన్ని గతంలో పురాణాల్లో విన్నామని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నామని నాని విమర్శించారు. వైఎస్ జగన్ పచ్చినెత్తురు తాగే వ్యక్తి అని విమర్శించారు. బీజేపీతో కుమ్మక్కయిన వైసీపీ నేతలు టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. 
 
రాజారెడ్డి లాగా ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నడూ సామూహిక హత్యలు చేయలేదనీ, రాజకీయ ఎదుగుదల కోసం అన్నం పెట్టినవారిని చంపలేదని వ్యాఖ్యానించారు. కొడుకు వైఎస్ రాజకీయ ప్రస్థానం కోసం రాజారెడ్డిలా చంద్రబాబు ఎన్నడూ రాజకీయ హత్యలు చేయించలేదని కేశినేని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు ఆర్థిక నేరాల్లో సైతం ప్రతిపక్ష నేత జగన్ పేరు వస్తోందని విమర్శించారు. ఇలాంటి సందర్భాల్లో ఏ-1గా చంద్రబాబు పేరు ఉండాలా? లేక రాజశేఖరరెడ్డి కుటుంబం పేరు ఉండాలా? అని అడిగారు.