శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 19 అక్టోబరు 2018 (18:30 IST)

జగన్‌ను మించిన రాక్షసుడు లేడు.... మంత్రి పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు...

డ్వాక్రా రుణ మాఫీపై వై.ఎస్ జగన్ వ్యాఖ్యలకు పరిటాల సునీత ఘాటుగా స్పందించారు. ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని జగన్ హేళనగా మాట్లాడటం ద్వారా కోటి మంది డ్వాక్రా మహిళలను అవమానపర్చడమే అన్నారు. డ్వాక్రా మహిళలకు ‘పసుపు-కుంకుమ’ పథకం క్రింద తుది విడత నిధులు మంజూరు చేశామని 10 రోజుల్లో మహిళల బ్యాంకు ఖాతాలలో ఆ మొత్తం జమ అవుతుందన్నారు. 
 
డ్వాక్రా మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం చేయూతనిచ్చిందని ఈ అంశంపై  చర్చకు నేను సిద్ధం..? జగన్మోహన్ రెడ్డీ నీవు సిద్దమా..? అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాక్షస భాష, రాక్షస కార్యక్రమాల్లో జగన్‌ను మించిన రాక్షసుడు లేడని, అసలుసిసలు మహిషాసురుడు జగన్ అని అందుకే 2014 ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు మహిషాసుర మర్దన చేశారన్నారు.
 
రాబోయే ఎన్నికల్లో ‘జగనాసురుడి’ని పూర్తిగా మర్దించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు పరిటాల సునీత. మరి సునీత వ్యాఖ్యలకు వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.