గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 14 అక్టోబరు 2018 (11:17 IST)

మంత్రి సోమిరెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. లేదంటే మరో హరికృష్ణలా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించే నిమిత్తం వెళుతుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 
మంత్రి సోమిరెడ్డి, ఆయన సిబ్బంది ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై వారి వాహనం అదుపు తప్పి.. డివైడర్ పైకి దూసుకెళ్లింది. అయితే, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, తన అనుభవాన్ని చూపిస్తూ, వాహనాన్ని అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. 
 
సోమిరెడ్డికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత ఆయన మరో వాహనంలో తన పర్యటనను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన మందస గ్రామంలో తుఫాను బాధితులను పరామర్శిస్తున్నారు. సోమిరెడ్డి పెను ప్రమాదం తప్పించుకోవడానికి ప్రధాన కారణం ఆయన డ్రైవరే. లేనిపక్షంలో సినీ నటుడు హరికృష్ణ కారు ప్రమాదానికి గురైనట్టుగా సోమిరెడ్డి కారు కూడా ప్రమాదానికి గురైవుండేది.