సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (17:12 IST)

మేము ఊరకుక్కలమైతే.. నువ్వు ఊరపందివా? : జగన్‌పై మంత్రి ఆదినారాయణ ప్రశ్న

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. 'మా వంశ చరిత్ర గురించి నీవు మాట్లాడితే నీ చరిత్ర వందసార్లు చెబుతా.. మేం ఊరకుక్కలమైతే.. నువ్వు ఊరపందివి' అంటూ జగన్‌నై

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. 'మా వంశ చరిత్ర గురించి నీవు మాట్లాడితే నీ చరిత్ర వందసార్లు చెబుతా.. మేం ఊరకుక్కలమైతే.. నువ్వు ఊరపందివి' అంటూ జగన్‌నై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ, విశాఖలో విజయమ్మ తన వల్లే ఓడిపోయిందని ఒప్పుకుంటే... జగన్‌ వల్ల మేం గెలిచామని ఒప్పుకుంటామని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. 
 
వైఎస్ సీఎం కావడానికి తాము కూడా కృషి చేశామని, ఆ విషయం మర్చిపోవద్దని ఆదినారాయణరెడ్డి సూచించారు. ఎవరి చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసునని, వైసీపీ పెట్టిన నాటి చరిత్ర ఏమిటో చెబితే పారిపోతావని మంత్రి జగన్‌ను హెచ్చరిస్తూ అన్నారు. 
 
తన తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు జగన్ ఇంకా పుట్టలేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా నీ వద్దకు వచ్చానని, ఆ రోజు ఎమ్మెల్యేల ఫిరాయింపులు గుర్తులేదా? అని జగన్‌ను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు.